close

తాజా వార్తలు

Updated : 22/07/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనాతో మాట్లాడటం ఇష్టంలేదు: ట్రంప్‌

రెండోదశ వాణిజ్య ఒప్పందంపై అనాసక్తి..
వైరస్‌తో నష్టపరిచారని చైనాపై మరోసారి ధ్వజం

వాషింగ్టన్‌: రెండో దశ వాణిజ్య ఒప్పందం కోసం చైనాతో సంప్రదింపులు జరపడం తనకు ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంతో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందానికి తలుపులు మూసుకుపోయాయి. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కారణంగా చైనాతో మాట్లాడడానికి ఆసక్తి లేదని అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ‘జనవరిలో జరిగిన తొలిదశ ఒప్పందంలో చైనాతో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. కానీ, ఒప్పందంపై చేసిన సంతకం సిరా ఆరిపోకముందే చైనా ప్లేగు (కరోనావైరస్‌) అమెరికాపై దాడి చేసింది’ అని ట్రంప్‌ ఆరోపించారు. ఈ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడే ఆలోచన లేదన్నారు. తొలిదశలో జరిగిన ఒప్పందంలో ముఖ్యంగా అమెరికా వస్తువుల కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తాజాగా రెండోదశ చర్చలు జరిగే అవకాశం ఉందని నిపుణులు భావించినప్పటికీ ట్రంప్‌ మాత్రం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌కు చైనానే కారణమంటూ గత కొన్నినెలలుగా అమెరికా అధ్యక్షుడు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. కరోనా‌ మహమ్మారికి చైనానే జవాబుదారీగా ఉండాలని పలుమార్లు స్పష్టం చేశారు. తొలిదశ వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడిలేకుంటే పూర్తిగా ఒప్పందమే రద్దు చేసుకుంటామని ఇదివరకే చైనాను ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాదు, చైనాపై తాను వ్యవహరించినట్లుగా మరే అధ్యక్షుడు ఇంత కఠినంగా వ్యవహరించలేదని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని