close

తాజా వార్తలు

కిమ్‌కు ట్రంప్‌ పరోక్ష హెచ్చరికలు..!

వాషింగ్టన్‌: చాలా కీలకమైన ఆయుధ పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించిన ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇదే తరహాలో వ్యవహరిస్తే అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధాన్ని కోల్పోయే అవకాశం ఉందంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. ‘‘కిమ్ జోంగ్‌ ఉన్‌ చాలా తెలివైనవారు. కానీ, ఇలాంటి ప్రతికూల చర్యల వల్ల ఆయన చాలా కోల్పోయే అవకాశం ఉంది. సింగపూర్‌లో మాతో ఓ పటిష్ఠ అణు నిరాయుధీకరణ ఒప్పందానికి అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడితో ఉన్న ప్రత్యేక బంధాన్ని ఆయన రద్దు చేసుకోరనే అనుకుంటున్నా. కిమ్‌ నేతృత్వంలో ఉత్తరకొరియా ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒప్పందం ప్రకారం ఆ దేశం అణు నిరాయుధీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నాటో దేశాలు, చైనా, రష్యా, జపాన్‌ అన్ని ఏకతాటిపై ఉన్నాయి’’ అని ట్రంప్ ట్వీట్‌ చేశారు. పరోక్షంగా కిమ్‌ తన దూకుడుని తగ్గించుకోకపోతే అమెరికాతో బంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరోక్షంగా హెచ్చరించారు.

ఆయుధ పరీక్షలతో అలజడి సృష్టిస్తున్న ఉత్తరకొరియా.. చలా కీలకమైన పరీక్షను నిర్వహించినట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సోహే ఉపగ్రహ ప్రయోగ పరీక్ష కేంద్రం వద్ద దీన్ని చేపట్టినట్లు తెలిసింది. అయితే ఆ పరీక్ష ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. అణ్వస్ర్తాల అంశంపై నిలిచిపోయిన చర్చలకు సంబంధించి అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఈ పరీక్షను చేపట్టింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.