జనవరి తొలివారంలో ఆక్స్‌ఫర్డ్‌‌ టీకా?

తాజా వార్తలు

Published : 28/12/2020 00:59 IST

జనవరి తొలివారంలో ఆక్స్‌ఫర్డ్‌‌ టీకా?

క్లారిటీ ఇచ్చిన బ్రిటన్‌ ఆరోగ్యశాఖ

లండన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ తొందరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్‌కు జనవరి 4వ తేదీన యూకేలో అందుబాటులోకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై తాజాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ స్పందించింది. ‘వ్యాక్సిన్ ప్రయోగాల‌ సమాచారాన్ని విశ్లేషించేందుకు నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ)కు కొంత సమయం ఇవ్వాలి. ఎంహెచ్‌ఆర్‌ఏ సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం’‌ అని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ జనవరి నాలుగో తేదీన అందుబాటులోకి వస్తుందని బ్రిటన్‌ మీడియా తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే రెండు వారాల్లోనే దాదాపు 20లక్షల మందికి ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు అక్కడి వార్త సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ 70శాతానికి పైగా సమర్థత కలిగినట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఇదివరకే వెల్లడించాయి. మరోవైపు కొత్తరకం వైరస్‌ విజృంభణ కొనసాగడం, యూకేలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూకే నిర్ణయం వైపే భారత్‌  చూపు..
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లోనూ జరుగుతోన్న విషయం తెలిసిందే. వీటిని భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ అనంతరం బ్రిటన్‌ నియంత్రణ సంస్థలు తీసుకునే నిర్ణయం కోసమే భారత్‌ నియంత్రణ సంస్థలు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్రిటన్‌లో వ్యాక్సిన్‌కు అనుమతి అభించిన వెంటనే భారత్‌లోని నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కూడా వ్యాక్సిన్‌ సమాచార విశ్లేషణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి..
భారత్‌లో ఈ వ్యాక్సిన్‌కే తొలి అనుమతి?
మోడెర్నా టీకాతో అమెరికా వైద్యుడికి అలర్జీ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని