close

తాజా వార్తలు

Updated : 03/12/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మరణాల్లో ‘అగ్ర’దేశం

అమెరికాలో నిన్న ఒక్కరోజే 2700 పైచిలుకు మరణాలు

వాషింగ్టన్: కొవిడ్ మహమ్మారి ధాటికి అమెరికా వణికిపోతోంది. వైద్యరంగంలో మెరుగైన సదుపాయాలకు పేరుగాంచిన అగ్రదేశం.. కరోనా సృష్టించే విలయాన్ని అడ్డుకోలేకపోతోంది. ఏ దేశంలో లేని విధంగా మరణాల సంఖ్య నానాటికీ రికార్డు మార్కులను దాటేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు 2,731 కొవిడ్ మరణాలు సంభవించాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి ఇదే అత్యధిక మరణాల సంఖ్య. కాగా, ఇప్పటి వరకు 2,73,181 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. 

ప్రస్తుతం అమెరికాలో పండుగల సీజన్ నడుస్తోంది. కొవిడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా ప్రజలు గుంపులుగా చేరి వేడుకలు చేసుకోవడం, బంధువులను కలుసుకునేందుకు ప్రయాణాలు చేయడం అక్కడి అధికారులను కలవరపెడుతోంది. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కేసులు రెండు లక్షలకు చేరువగా ఉండగా.. ప్రస్తుతం అక్కడ 1,39,16,543 మంది వైరస్ బారిన పడ్డారు. అలాగే, బుధవారం నాటికి లక్ష మందికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఈ స్థాయిలో ప్రజలు ఆసుపత్రుల బారినపడటం ఇదే మొదటిసారని కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ట్వీట్ చేసింది. దాంతో ఈ వైరస్ విజృంభణను కట్టడిచేసే టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన