close

తాజా వార్తలు

అత్యాచార ఘటనలపై ఉబర్‌కు 235 ఫిర్యాదులు

సాన్‌ఫ్రాన్సిస్కో: ఉబర్‌ వాహనాల్లో ప్రయాణిస్తుండగా తమపై అత్యాచారం జరిగినట్టు 2018 జనవరి నుంచి డిసెంబర్‌ మధ్యలో తమకు 235 ఫిర్యాదులు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే అమెరికా వాహన సేవల సంస్థ ఉబర్‌ తొలిసారిగా తన సంస్థ భద్రతా నివేదికను విడుదల చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2017, 2018లో తమ వాహనాల్లో జరిగిన లైంగిక దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు వంటి దుర్ఘటనల సమాచారాన్ని బయటపెట్టింది. 2017లో 229.. 2018లో 235 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. మొత్తం మీద అనుమతి లేకుండా తాకడం వంటి లైంగిక వేధింపుల సంఘటనలు తమపై చోటుచేసుకున్నట్టు 3,000 మంది ఆరోపించారు.

కాగా ఈ ఘటనలు వినియోగదారులు, డ్రైవర్లు ఇద్దరి పైనా జరిగినట్టు నివేదికలో తేలింది. లైంగిక దాడులు జరిగినట్టు ఆరోపించిన వారిలో 54 శాతం డ్రైవర్లే కాగా, వినియోగదారులు 45 శాతం ఉన్నారు. మిగిలిన ఒక్క శాతం తమపై బయటి వారు దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఇక హత్యల విషయానికి వస్తే 2018లో ఉబర్‌ వాహనాల్లో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది కాగా, 2017లో అది పదికి చేరింది.

‘‘దాడికి గురైన ప్రతి ఒక్కరూ.. తాము శారీరకంగా, మానసికంగా తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. అయితే ఈ సంఖ్య నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే చాలా మంది ఊహిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా సమాజంలో లైంగిక హింస జరుగుతోంది.’’ అని ఉబర్‌ ముఖ్య న్యాయాధికారి టోనీ వెస్ట్‌ తెలిపారు. తమ డ్రైవర్లు, వినియోగదారులకు మరింత భద్రత కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.