నితిన్‌ గడ్కరీకి కరోనా

తాజా వార్తలు

Published : 16/09/2020 21:57 IST

నితిన్‌ గడ్కరీకి కరోనా

దిల్లీ: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. తనకు నిన్న నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజటివ్‌ అని తేలిందని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌, శ్రీపాద్‌ నాయక్‌ సహా పలువురు కేంద్రమంత్రులు ఈ మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని