అన్‌లాక్‌ 3.0: వాటికి అనుమతిస్తారా?

తాజా వార్తలు

Published : 27/07/2020 01:40 IST

అన్‌లాక్‌ 3.0: వాటికి అనుమతిస్తారా?

న్యూదిల్లీ: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఆ నిబంధనలను సడిలిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈనెల 31తో అన్‌లాక్‌ 2.0 ముగియనుంది. ఇప్పటికే చాలా నిబంధనలు సడలించిన ప్రభుత్వం మరి కొన్నింటిని కూడా సడలించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఈసారి వీటికి మినహాయింపు ఇస్తారా?

ఆగస్టు 1వ తేదీ నుంచి చాలా కార్యకలాపాలు, సంస్థలకు సంబంధించిన నిబంధనలు మరింత సడలించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిమ్‌లు, సినిమాహాళ్లకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భౌతికదూరం నిబంధనల మేరకు వీటిని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వొచ్చు. అయితే, పాఠశాలలు, మెట్రో రైళ్లు, సేవలపై లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ  విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ)శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎక్కువమంది తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు థియేటర్‌ యజమానులు వాటిని ఓపెన్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతించాలని కోరుతుండగా, కేంద్రం 25శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతిస్తామని చెబుతోంది. ఇందుకు థియేటర్‌ యజమానులు సుముఖత వ్యక్తం చేయలేయడం లేదు. అన్‌లాక్‌ 3.0కు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని