వాహనాలపై ఆ స్టిక్కర్లు అంటిస్తే సీజ్‌ చేస్తాం!

తాజా వార్తలు

Published : 29/12/2020 01:26 IST

 వాహనాలపై ఆ స్టిక్కర్లు అంటిస్తే సీజ్‌ చేస్తాం!

లఖ్‌నవూ: సామాజిక వర్గాల పేరుతో వాహనాలపై స్టిక్కర్లు అంటించడాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడినవారి వాహనాలు వెంటనే సీజ్‌ చేస్తామంటూ యూపీ పోలీస్‌శాఖ ప్రకటన కూడా జారీ చేసింది. వివరాల్లోకి  వెళ్తే, ఉత్తర్‌ప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా కొంతమంది, ముఖ్యంగా యువత తమ సామాజిక వర్గం పేరుతో ఉండే స్టిక్కర్లను వారి కార్లు, మోటారుసైకిళ్ల నెంబర్‌ ప్లేట్లపై, విండో అద్దాలపై అతికించి తిరుగుతున్నారు.

యూపీ రవాణాశాఖ జారీ చేసే వాహన నెంబర్లు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. సమాజంలో ఈ తరహా ధోరణి చెడు సంస్కృతికి ఊతమిచ్చేలా ఉందని, భారతీయ సర్వ సమానత్వ విధానానికి ఈ చర్యలు విఘాతం కలిగించేలా ఉన్నాయని తెలుపుతూ హర్షల్‌ ప్రభు అనే ఒక ఉపాధ్యాయుడు ప్రధాని కార్యాలయానికి, కేంద్ర రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖకుకు ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీఎమ్‌వో ఇలాంటి ధోరణి ఉపేక్షించరాదని రవాణాశాఖను ఆదేశించింది. దీంతో వారు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి అలాంటి స్టిక్కర్లను తొలగించారు. ఇకపై అటువంటి  స్టిక్కర్లు వాహనాలపై అంటిస్తే సీజ్‌ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని