close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సియోల్‌ నైట్‌క్లబ్‌ల‌తో 225 మందికి కరోనా  

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని నైట్‌ క్లబ్‌ల కారణంగా ఇప్పటి వరకు 225 మందికి కరోనావైరస్‌ సోకింది. ఈ నెల మొదట్లో పాజిటివ్‌ వచ్చిన 29ఏళ్ల యువకుడు మొత్తం మూడు నైట్‌ క్లబ్‌లకు వెళ్లాడు. ఆ ప్రదేశానికి సమీపంలో దాదాపు 10వేల మంది ఉన్నారు. దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తమై వీరందరికి పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. ఏప్రిల్‌ 24 నుంచి మే 6 మధ్యలో ఆ క్లబ్‌లు, పరిసర ప్రాంతాలను సందర్శించిన వారిని మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా  గుర్తించి సంక్షిప్త సందేశాలను పంపింది. ఇప్పటి వరకు 225 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారించారు. ఇక్కడ తొలికేసును మే 9న గుర్తించారు. దక్షిణ కొరియా భౌతిక దూరం నిబంధనలు సడలించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు అక్కడ 11,190 కేసులు రాగా.. వీటిల్లో 266 మంది మరణించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.