మా ఆఫీసే అప్రమత్తం చేసింది: డబ్ల్యూహెచ్‌వో 
close

తాజా వార్తలు

Published : 04/07/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా ఆఫీసే అప్రమత్తం చేసింది: డబ్ల్యూహెచ్‌వో 

 చైనా సహకరించింది 

జెనీవా: వుహాన్‌లో తొలి దశలో వైరల్‌ న్యూమోనియా కేసులు వస్తున్న సమయంలో చైనాలోని తమ కార్యాలయమే తొలుత అప్రమత్తమై చైనాను సమాచారం కోరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరు పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. 
హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగర పరిధిలో డిసెంబర్‌ 31న న్యూమోనియా కేసులు నమోదైనట్లు  చెప్పింది. కానీ, వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందా.. లేదా చైనా అధికారులు గుర్తించి చెప్పారా అనే విషయాన్ని వెల్లడించలేదు.  అదే సమయంలో ఏప్రిల్‌ 20న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథెనమ్‌ గెబ్రియోసిస్‌ మాట్లాడుతూ ‘చైనా నుంచి నివేదకలు వచ్చాయి’ అన్నారే కానీ, ఆ నివేదికలను చైనా అధికారులు పంపారా.. మరెవరు పంపారో వెల్లడించలేదు.  

తాజాగా దీనికి సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించింది. చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం డిసెంబర్‌ 31న వుహాన్‌ హెల్త్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ‘వైరల్‌ న్యూమోనియా’ కేసుల అంశాన్ని ప్రస్తావించడం చూసి అప్రమత్తమైనట్లు పేర్కొంది.  అదే రోజు అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిఘా నెట్‌వర్క్‌ సంస్థ ప్రోమెడ్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎపిడమిక్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు ఇదే సమాచారం తెలియజేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వో జనవరి 1, 2 తేదీల్లో రెండుసార్లు చైనాను దీనిపై సమాచారం కోరింది. చైనా ఈ సమాచారాన్ని 3వ తేదీన సమర్పించింది. 

చైనాను వెనకేసుకొచ్చిన మైఖల్‌ రేయాన్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం అడిగాక ఆయా దేశాలు.. పరిశీలించి  48 గంటల్లో సమాచారం వెల్లడించే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ రేయన్‌ పేర్కొన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిన వెంటనే చైనా అధికారులు వీలైనంత తొందరగా స్పందించారని పేర్కొంది.  దీంతో చైనా విషయంలో తాము ఏమాత్రం అసంతృప్తిగా లేమని మరోసారి చెప్పకనే చెప్పినట్లైంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని