close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/07/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెచ్‌సీక్యూ, హెచ్‌ఐవీ మందుల ప్రయోగాల నిలిపివేత 

కరోనా మరణాలు తగ్గించడంలో విఫలం: WHO

జెనీవా: కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ), హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్‌తో చేస్తున్న ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు ఎంతమేర ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు గత కొంతకాలంగా డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ ప్రయోగాలకు సంబంధించి ఇటీవల అందిన మధ్యంతర ఫలితాల్లో ఆయా ఔషధాల ప్రభావం అతి తక్కువగా ఉన్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కొన్ని కేసుల్లో అసలు ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. మరణాల శాతాన్ని తగ్గించడంలో ఇవి ఏమాత్రం సఫలం కాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధ్యయనాన్ని వెంటనే నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో చేరని వారిపై, వైరస్‌ ముప్పును తప్పించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా దీన్ని ఉపయోగించవచ్చో.. లేదో.. పరీక్షించేందుకు జరుగుతున్న ప్రయోగాలపై మాత్రం ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.