ఆక్స్‌ఫర్డ్‌ టీకా: అనుమతి కోసం వేచిచూస్తున్నాం!

తాజా వార్తలు

Published : 30/12/2020 21:20 IST

ఆక్స్‌ఫర్డ్‌ టీకా: అనుమతి కోసం వేచిచూస్తున్నాం!

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ ఆమోదించడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ అనుమతులపై వేచిచూస్తున్నామని వెల్లడించింది. ‘కొవిషీల్డ్‌ టీకా బ్రిటన్‌లో అనుమతి పొందడం గొప్ప వార్త. భారత్‌లోనూ తుది అనుమతి కోసం మేం వేచిచూస్తున్నాం’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ఓ ప్రకటనలో తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్‌(AZD1222 or ChAdOx1 nCoV-19) వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగాలతో పాటు ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరమ్‌ సంస్థ డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) వద్ద దరఖాస్తు చేసుకుంది. తాజాగా బ్రిటన్‌లో అనుమతి పొందిన నేపథ్యంలో భారత్‌లోనూ అనుమతిచ్చే అంశంపై నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో త్వరలోనే భారత్‌లో అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌లో సరఫరా చేసేందుకు 5కోట్ల డోసులను సిద్ధం చేసుకున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా మార్చినుంచి ప్రతి నెల దాదాపు 10కోట్ల డోసులను తయారుచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మార్చినాటికే దాదాపు 30కోట్ల డోసులను సిద్ధం చేస్తామని తెలిపింది. ఇక భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌ కూడా టీకా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఫైజర్ నుంచి మరింత సమాచారం కోరడం..మరోవైపు భారత్‌ బయోటెక్‌ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో భారత్‌లో మొదటగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కే అనుమతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ బ్రిటన్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 4వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అక్కడ ఫైజర్‌ టీకాను అందిస్తుండగా.. అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌గా ఆక్స్‌ఫర్డ్‌ నిలిచింది.

ఇవీ చదవండి..
ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు బ్రిటన్‌లో అనుమతి
ఆక్స్‌ఫర్డ్‌ టీకా: 5కోట్ల డోసులు సిద్ధం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని