close

తాజా వార్తలు

పరిస్థితి చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రే ర్యాలీ చేస్తారా?

ఆగ్రహం వ్యక్తం చేసిన బంగాల్‌ గవర్నర్‌

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ సోమవారం పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టనున్న ర్యాలీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధనకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రే సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

‘సీఏఏకి వ్యతిరేకంగా సీఎం, మంత్రులు ర్యాలీ చేపడతాననడం బాధాకారం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ప్రస్తుత పరిస్థితులను సద్దుమణిగేలా చేయకుండా ఇటువంటి ర్యాలీలు చేపట్టి వాటిని మరింత రెచ్చగొట్టే విధంగా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సీఏఏకి వ్యతిరేకంగా ర్యాలీ జరగనుంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. రెడ్‌ రోడ్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ జోరాసంకో థాకుర్బరి వద్ద ముగియనుంది. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా పశ్చిమ బంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఆందోళనలు జరిగే ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.