close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/06/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాంటిఫా ఏమిటీ..ట్రంప్‌కు కోపమెందుకు? 

 అమెరికాలో ఆందోళనల వెనుక ఈ గ్రూపు?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘యాంటిఫా’ ఇప్పుడు ట్రంప్‌ టార్గెట్‌లో ఉన్న సంస్థ. అమెరికాలో నల్లజాతీయులపై దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఈ సంస్థ హస్తం ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ సంస్థకు కమ్యూనిస్టు దేశాల నుంచి సహకారం అందుతోందనే అనుమానాలు కూడా ట్రంప్‌ కార్యవర్గం వ్యక్తం చేస్తోంది. ఓ పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ ఆందోళనలు తీవ్రం కావడం ట్రంప్‌కు సవాలుగా మారింది. దీంతో యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తామని గతనెలాఖరులో ట్విటర్‌లో వెల్లడించారు. కాకపోతే ఇది సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు దీన్ని ఒక రాజకీయ స్టంట్‌గా పేర్కొంటున్నాయి. 

యాంటిఫా అంటే ఏమిటి..? 

యాంటిఫా అనేది సంస్థ కాదు.. వ్యవస్థీకృతమైన రూపం లేదు. తీవ్ర వామపక్ష ‌భావజాలం ఉన్న వ్యక్తుల సమూహం. ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమం దీనికి మూలం. యాంటి-ఫాసిస్ట్‌ను.. షార్ట్‌కట్‌లో ‘యాంటిఫా’ అంటారు.  రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో నాజీలకు వ్యతిరేకంగా 1930లో ఈ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత హిట్లర్‌ అనుచరులు దీనిని పూర్తిగా అణగదొక్కేశారు. 1970లో అమెరికాలోని నియో-నాజీజానికి వ్యతిరేకంగా ఇది మొదలైంది. ఐరోపాలో కూడ 1980, 90ల్లో చురుగ్గా పనిచేసింది.  వివిధ గ్రూపులు కలిపి యాంటిఫాగా పేర్కొంటారు. వీటన్నింటిపై ఎటువంటి కేంద్ర నాయకత్వం ఉండదు. 2007లో అమెరికాలోని పోర్ట్‌లాండ్స్‌లోని రోజ్‌ సిటీలో యాంటిఫాగా ఒక గ్రూప్‌  పనిచేసింది. ఆ తర్వాత అంత చురగ్గా లేదు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శ్వేతజాతి దురహంకారంపై యాంటిఫా కొంచెం చురుగ్గా పనిచేస్తోంది. 

యాంటిఫా  ఎలా పనిచేస్తుంది..?

తాజాగా జరిగే ఉద్యమంలో వీరు పూర్తిగా నలుపు దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. వీరు శ్వేతజాతి అహంకారపూరిత భావజాలం ఉన్న వారిని గుర్తించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటివి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ బృందాలు నిర్వహించే ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొన్ని సార్లు సంప్రదాయ గ్రూపులతో, మరికొన్ని సార్లు పోలీసులతో వీరికి ఘర్షణలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో వీరు.. ఫొటోలు తీసే జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లతో కూడా ఘర్షణకు దిగుతుంటారు. వాస్తవానికి ‘బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్‌’ ఆందోళనలను కవర్‌ చేసిన జర్నలిస్టులపై అక్కడ పోలీసులు కూడా కేసులు పెట్టారు.

ప్రస్తుత ఆందోళనల్లో యాంటిఫా పాత్ర..?

అమెరికాలో జార్జిఫ్లాయిడ్‌ మృతి తర్వాత అమెరికాలో చెలరేగిన అల్లర్లలో యాంటిఫా హస్తం ఉందని ట్రంప్‌ కార్యవర్గం బలంగా నమ్ముతోంది. అటార్ని జనరల్‌ విలియమ్‌ బార్‌ ఈ అల్లర్లపై స్పందిస్తూ.. యాంటిఫా వంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. జూన్‌1వ తేదీన శ్వేతసౌధం కూడా అమెరికాలో అల్లర్లకు యాంటిఫానే కారణమని ఆరోపించింది. ముఖ్యంగా దుండగులను, దోపిడీదారులను, దహనకారులను వెంటేసుకొని హింసకు పాల్పడుతోందని ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్నానీ పేర్కొంది. 

ట్రంప్‌ నేరుగా రంగంలోకి..

యాంటిఫాపై మాటల దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంపే నేరుగా రంగంలోకి దిగారు. ఆయన మే 31న ట్వీట్‌ చేస్తూ ‘‘యాంటిఫాను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించనుంది’’ అని ట్వీట్‌ చేశారు. 2019లో ఒక సారి ట్రంప్‌ ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 

ఇది సాధ్యమేనా..?

యాంటిఫా అనే దానికి వ్యవస్థీకృత రూపం లేకపోవడంతో  అమెరికా చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాకపోవచ్చు. పైగా అది దేశీయ సంస్థ కావడంతో విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించలేదు. కొన్నాళ్ల క్రితం తీసుకొచ్చిన దేశీయ ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒక వేళ ప్రకటించకపోయినా అమెరికా దర్యాప్తు బృందాలు మాత్రం దానిపై ఓ కన్నేసి పెడతాయి.

ఇదీ చదవండి

జాత్యహంకారంపై గళం విప్పిన ప్రపంచం
  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.