మేమే వాటిని చూడలేం: వాట్సాప్‌ 
close

తాజా వార్తలు

Published : 27/09/2020 01:44 IST

మేమే వాటిని చూడలేం: వాట్సాప్‌ 

సందేశాల భద్రతపై భరోసా ఇచ్చిన సంస్థ

కాలిఫోర్నియా: వాట్సాప్‌ సందేశాలను మూడో వ్యక్తి పొందేందుకు వీలు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసినట్లు సామాజిక మాధ్యమ సంస్థ వెల్లడించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వాట్సాప్‌ సందేశాలను పరిశీలించగా డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ బ్యూరో (ఎన్‌సీబీ)బాలీవుడ్ లోని పలువురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది.  దాంతో సమాచార భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సంస్థ ప్రకటన వెలువడింది.  

‘ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం ద్వారా వాట్సాప్‌ వినియోగదారుల సందేశాలను గోప్యంగా ఉంచుతోంది. దాంతో మీరు, మీరు సంభాషించే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. చివరికి వాట్సాప్‌తో సహా ఎవరు కూడా వాటిని పొందలేరు’ అని సంస్థ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించే పాస్‌వర్డ్, బయోమెట్రిక్‌ ఐడీ వంటి భద్రతా చర్యలను ఉపయోగించాలని, దాని ద్వారా సమాచారాన్ని థర్డ్‌ పార్టీ పొందకుండా నిరోధించవచ్చని సూచించారు. 

ఈ వాట్సాప్ చాటింగ్‌ల ఆధారంగానే హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌, దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌కు సమన్లు అందాయి. రకుల్‌ను శుక్రవారం ఎన్‌సీబీ ప్రశ్నించగా..ఈ రోజు మిగతావారు హాజరయ్యారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని