close

తాజా వార్తలు

Published : 28/11/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఈ రోజు ఉన్నాం.. ఏదో రోజు మరణమేగా’

హృదయాల్ని కలచివేస్తున్న జవాన్‌ ఆఖరిమాటలు

శ్రీనగర్‌: వయసు చిన్నదే.. కానీ, మనసంతా దేశం కోసం పనిచేయాలనే ఆరాటం. అందుకే ఊరు కానీ ఊరు వచ్చి, పొరుగు రాష్ట్రంలో అన్ని పరీక్షలు దాటుకొని తన కలను సాకారం చేసుకున్నాడు. దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తూ, శత్రుమూకలను తరిమికొడుతూ భరతమాత రుణం కొంతైనా తీర్చుకుంటున్నాడు. అప్పుడే విధికి కన్నుకుట్టింది. ఉగ్రదాడి రూపంలో ముంచుకొంచి ఆ యువ సైనికుడిని ప్రాణాలు బలిగొంది. ఈ క్రమంలో అతడు మరణానికి కొద్ది గంటల ముందు తన స్నేహితుడితో మాట్లాడిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దేశ రక్షణలో నిత్యం ప్రాణాలకు తెగించి పోరాడే తమకు ఏదో ఒక రోజు మరణం తప్పదు కదా అని ఆ జవాన్‌ అన్న మాటలు హృదయాల్ని కలచివేస్తున్నాయి.

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చాలిగావ్ తాలూకాకు చెందిన యశ్‌ దేశ్‌ముఖ్‌ సైన్యంలో చేరాలనే ఇష్టంతో 2019లో కర్ణాటకలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యారు. అక్కడే ఆర్మీకి ఎంపికై, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని 101 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత గురువారం శ్రీనగర్‌లోని పారింపొరాలో జరిగిన దాడిలో సిపాయ్ రతన్‌ సింగ్‌తో సహా యశ్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అతడి మరణంతో స్వగ్రామంలో రోదనలు మిన్నంటాయి. కాగా.. ఈ ఘటనకు ఒక రోజు ముందు యశ్‌.. తన స్నేహితుడితో వాట్సాప్‌ ద్వారా మాట్లాడారు. ఎలా ఉన్నావ్‌ మిత్రమా? అని ఆ స్నేహితుడు యశ్‌ను అడగ్గా.. ‘‘నేను బాగానే ఉన్నాను. మా జీవితం గురించి ఏం చెబుతాం! ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఏదో ఒకరోజు పోతాం!’’ అంటూ సమాధానమిచ్చాడు. సైనికుడి జీవితం దినదిన గండంగానే ఉంటుందని తన మిత్రుడితో వెల్లడించాడు. అయితే అవే తన ఆఖరిమాటలవుతాయని యశ్‌ కూడా ఊహించి ఉండరు. ఆ మరుసటి రోజే ఉగ్రదాడి రూపంలో యశ్‌ మృత్యుఒడికి చేరుకున్నారు. మరణానికి కొద్ది గంటల ముందు యశ్‌ చేసిన ఆ వాట్సాప్‌ చాట్ సామాజిక మాధ్యమాల్లో  ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా.. ముంబయి పేలుళ్లు జరిగి 12ఏళ్లు పూర్తయిన రోజే మహారాష్ట్రకు చెందిన ఓ జవాను ఉగ్రదాడిలో మరణించడం బాధాకరం. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని