
తాజా వార్తలు
క్రిస్మస్ తాత ఈసారి బహుమతులు తెస్తాడా?
చిన్నారి సందేహానికి బ్రిటన్ ప్రధాని స్పందన
లండన్: మోంటీ అనే ఓ ఎనిమిదేళ్ల గడుగ్గాయి క్రిస్మస్ తాత శాంటాక్లజ్ రాకను గురించి ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా అని బ్రిటన్ ప్రధానినే ప్రశ్నించాడు. ప్రధాని చాలా బిజీగా ఉంటారని తనకు తెలుసని.. ఐతే ఈ విషయమై ఆయన శాస్త్రవేత్తలతో చర్చలు జరిపాలని ఆ బాలుడు కోరాడు. క్రిస్మస్ తాత కోసం అందరూ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని ఆ చిన్నారి సలహా ఇచ్చాడు. ఈ సారి పండుగకు క్రిస్మస్ తాత బహుమతులు తెస్తాడా అని ప్రశ్నించిన ఆ చిన్నారికి.. క్రిస్మస్ తాత బహుమతులు పంచడాన్ని కరోనా వైరస్ మహమ్మారి అడ్డుకోలేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జవాబిచ్చారు.
కాగా, మోంటీ చేతిరాతతో కూడిన ఆ లేఖను బోరిస్ జాన్సన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తనకు ఈ మాదిరి అనేక లేఖలు వచ్చాయని.. అందుకే తాను ఉత్తర ధృవానికి కబురు చేశానన్నారు. అక్కడ ఫాదర్ క్రిస్మస్.. రుడాల్ఫ్, రెయిన్ డీర్‌తో కలసి వచ్చేందుకు తన బండిని సిద్ధం చేసుకున్నారని.. ఇక్కడికు వచ్చేందుకు ఆయన ఆతృతగా ఎదురుచూస్తున్నారని బ్రిటన్ ప్రధాని జవాబిచ్చారు.
ఇదిలా ఉండగా కొవిడ్ నియమాలకు అనుగుణంగా క్రిస్మస్ పండుగను జరుపుకునే వారికి ఎటువంటి ఆరోగ్య ప్రమాదం ఉండదని ఆ దేశ వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. క్రిస్మస్ తాత ఎప్పటిలాగే చాలా బాధ్యతాయుతంగా ఉంటారన్న ప్రథాని జాన్సన్ వ్యాఖ్యలను వైద్యవర్గాలు ప్రశంసించాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
