Rakesh Asthana: దిల్లీ పోలీస్‌ బాస్‌గా ఆస్థానా నియమకంపై సుప్రీంకోర్టులో సవాల్‌

తాజా వార్తలు

Published : 02/08/2021 15:47 IST

Rakesh Asthana: దిల్లీ పోలీస్‌ బాస్‌గా ఆస్థానా నియమకంపై సుప్రీంకోర్టులో సవాల్‌

గురువారం విచారణ జరిగే అవకాశం!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ అస్థానాను నియామకం వివాదాస్పదంగా మారింది. దిల్లీ పోలీస్‌ బాస్‌గా  కేంద్ర హోంశాఖ ఆయన్ను నియమించడంపై ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన తమకు వద్దంటూ ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేసింది. తాజాగా ఇదే అంశంపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆస్థానా నియమకాన్ని సవాల్‌ చేస్తూ ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆస్థానా పదవీ కాలం జులై 31తో పూర్తికావడానికి కేవలం మూడు రోజుల ముందే ఆయన్ను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించడంపై పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. ఆస్థానా నియామకం 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖపై విచారణ జరపాలంటూ శర్మ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని