Elgar Parishad: స్టాన్‌ స్వామి కన్నుమూత

తాజా వార్తలు

Updated : 05/07/2021 15:20 IST

Elgar Parishad: స్టాన్‌ స్వామి కన్నుమూత

ముంబయి: గిరిజన హక్కుల కార్యకర్త, ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందినట్లు ఆయన న్యాయవాది తెలిపారు. ఆయన బెయిల్‌పై కోర్టు విచారణ సందర్భంగా న్యాయవాది ఈ విషయాన్ని చెప్పారు.

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో ఆయన నవీ ముంబయిలోని తాలోజా జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బాంబే హైకోర్టు ఆదేశాలతో మే 28న హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆక్సిజన్‌ స్థాయులు తగ్గడంతో అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు.

మరోవైపు తీవ్ర అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ స్వామి న్యాయవాదులు ఈ ఉదయం బాంబే హైకోర్టును కోరారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభించేలోగానే ఆయన కన్నుమూశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని