close

తాజా వార్తలు

Updated : 02/03/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుప్రీంకోర్టుకు కంగనా రనౌత్‌

దిల్లీ: సోషల్‌మీడియా వేదికగా పలు విమర్శలు చేసినందుకుగానూ మహారాష్ట్రలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబయిలో నమోదైన కేసులను హిమాచల్‌ప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ముంబయిలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణానికి ముప్పు అని, శివసేన నేతల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని కంగన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ముంబయి కోర్టుల్లో తనపై ఉన్న మూడు కేసులను తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేయాని న్యాయస్థానాన్ని కోరారు. నటి తరఫున న్యాయవాది నీరజ్‌ శేఖర్‌ ఈ పిటషన్‌ దాఖలు చేశారు. 

సోషల్‌మీడియాలో మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ కంగన, ఆమె సోదరిపై రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రముఖ రచయిత‌ జావెద్‌ అక్తర్‌ ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసులను కొట్టివేయాలంటూ గతంతో కంగన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.  అక్కడ అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని