పాక్‌లో అఫ్గాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

తాజా వార్తలు

Published : 17/07/2021 21:43 IST

పాక్‌లో అఫ్గాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

చిత్రహింసలు పెట్టి అనంతరం విడుదల

కాబూల్‌: పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలిఖిస్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు అఫ్గాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సూపర్‌మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సిల్‌సిలాను అపహరించి చిత్రహింసలు పెట్టారని, అనంతరం విడిచిపెట్టారని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ దుశ్చర్యను ఆఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని, పాకిస్థాన్‌లో ఉన్న అఫ్గాన్‌ పౌరులకు తగిన భద్రత కల్పించాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే కిడ్నాప్‌ ఘటనపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ గానీ, ఇస్లామాబాద్‌ పోలీసులు గానీ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని