Taliban: ప్రతీకారం తీర్చుకునే హక్కు లేదు.. అలాంటి వాటిని సహించబోం

తాజా వార్తలు

Published : 24/09/2021 23:21 IST

Taliban: ప్రతీకారం తీర్చుకునే హక్కు లేదు.. అలాంటి వాటిని సహించబోం

కాబుల్: తాలిబన్లు అఫ్గాన్‌ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకున్న అనంతరం.. దేశవ్యాప్తంగా పలువురిపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఘనీ ప్రభుత్వ హయాంలోని అధికారులు, సైనికులు, హక్కుల కార్యకర్తలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించినా.. వారిపట్ల కఠినంగా వ్యవహరించినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ దుశ్చర్యలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ముల్లా మొహమ్మద్‌ యాకూబ్‌ తాజాగా కీలక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన.. కొంతమంది తాలిబన్‌ కమాండర్లు, ఫైటర్ల దుష్ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మందలిస్తూ.. అధికార దుర్వినియోగాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

‘కొంతమంది దుర్మార్గులు, అపఖ్యాతి పాలైన మాజీ సైనికులు.. తాలిబన్లలో చేరారు. అలాంటి వారు హింసాత్మకంగా వ్యవహరించారు. అలాంటివారిని తాలిబన్లలో చేర్చుకుంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అనధికార మరణశిక్షల గురించి సైతం నివేదికలు వచ్చాయని.. వాటిని సహించబోమన్నారు. ‘మీ అందరికీ తెలిసినట్లుగా, అఫ్గాన్‌లో ప్రకటించిన క్షమాభిక్ష ప్రకారం.. ఏ ముజాహిద్‌కు ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే హక్కు లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో శాంతి స్థాపన విషయంలో తాలిబన్ల కమాండర్లు, రాజకీయ నేతల మధ్య ఏకాభిప్రాయం లేనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. యాకూబ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని