తాలిబన్లకు పాక్‌ మద్దతిస్తోంది: అఫ్గాన్‌

తాజా వార్తలు

Published : 17/07/2021 01:05 IST

తాలిబన్లకు పాక్‌ మద్దతిస్తోంది: అఫ్గాన్‌

పాక్‌ తీరుపై మండిపడ్డ అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు

కాబూల్‌: పాక్ సైన్యం తాలిబన్లకు సహకరిస్తోందంటూ అఫ్గానిస్థాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఆరోపించారు. సరిహద్దు ప్రాంతమైన స్పిన్‌ బొల్డాక్‌ నుంచి తాలిబన్లను బహిష్కరించే చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్థాన్‌ వైమానిక దళం అఫ్గాన్‌ భద్రతా దళాలను హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. సలేహ్‌ గతంలో అఫ్గాన్‌ గూఢచార విభాగం చీఫ్‌గా పని చేశారు. ఒకట్రెండు సార్లు తాలిబన్ల దాడికి కూడా గురయ్యారు. ‘‘పాకిస్థాన్‌ వైమానిక దళం అఫ్గాన్‌ భద్రతాదళాలకు ఓ అధికారిక హెచ్చరిక జారీ చేసింది. స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతం నుంచి తాలిబన్లను బహిష్కరించే ఏ చర్యనైనా పాకిస్థాన్‌ వైమానిక దళం తిప్పి కొడుతుంది అని అందులో పేర్కొంది. పాక్‌ వైమానిక దళం తాలిబన్లకు వాయుమార్గాన సాయం చేస్తోంది’’ అని సలేహ్‌ ట్వీట్‌ చేశారు.

దీనిపై ఎవరికైనా అనుమానాలుంటే.. తన వద్దనున్న ఆధారాలు కూడా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌కు వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతమైన స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అఫ్గాన్‌ సేనలను భయపెట్టేందుకు పాకిస్థాన్‌ ఎయిర్‌ మిసైల్స్‌ను ప్రయోగించిందని సలేహ్‌ గురువారం వెల్లడించారు. అయితే దీనిపై పాక్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా తాలిబన్‌, అఫ్గాన్‌ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని