Afghanistan Crisis: రియల్‌ విలన్‌ పాకిస్థానే.. భారత్‌కు థాంక్స్‌!

తాజా వార్తలు

Updated : 24/08/2021 18:05 IST

Afghanistan Crisis: రియల్‌ విలన్‌ పాకిస్థానే.. భారత్‌కు థాంక్స్‌!

 పాప్‌ సింగర్‌ అర్యానా సయీద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ నెలకొన్న సంక్షోభానికి పాకిస్థానే కారణమని అఫ్గాన్‌ ప్రముఖ పాప్‌ సింగర్‌ అర్యానా సయీద్‌ అన్నారు. తాలిబన్లను పాకిస్థానే వెనుక ఉండి నడిపించడంతో పాటు నిధులు, శిక్షణ అందిస్తోందని మండిపడ్డారు. తాలిబన్ల మూలాలు అక్కడే ఉన్నాయన్నారు. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడంతో అఫ్గాన్‌ నుంచి తప్పించుకొని పారిపోయిన ఈ పాప్‌ స్టార్‌.. ఓ ఇంటర్వ్యూలో తమ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సమాజం పాక్‌కు నిధులు నిలిపివేస్తే తాలిబన్లకు సాయం అందదన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం కృషిచేయాలని కోరారు. 

‘‘నేను పాక్‌ను నిందిస్తున్నా. అనేక సంవత్సరాలుగా తాలిబన్ల వెనుక ఉండి నడిపిస్తున్నది పాకిస్థానే అని చెప్పేందుకు వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. మా ప్రభుత్వం తాలిబన్లను టచ్‌ చేసిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ అండను చూపిస్తుంటారు. అందుకే నేను పాక్‌ని నిందిస్తున్నా. ఇప్పటికైనా ఆ దేశం అఫ్గాన్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. తాలిబన్‌ ఉగ్రవాదులకు సూచనలు, శిక్షణ పాక్‌ నుంచే అందుతాయి. తాలిబన్ల మూలాలు అక్కడే ఉన్నాయి. తాలిబన్లకు సాయం అందకుండా అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌కు నిధులు నిలిపివేయాలని కోరుకుంటున్నా. అలాగే, అంతర్జాతీయ సమాజం కూర్చొని అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు పరిష్కారం కనుగొనాలని కోరుతున్నా. పాక్‌పై ఒత్తిడి పెంచాలి’’ అని పేర్కొన్నారు.

మా దేశం పట్ల భారత్‌ చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. నిజమైన మిత్రులుగా ఉండటమే కాకుండా అఫ్గాన్‌ ప్రజలకే కాదు.. శరణార్థులపట్ల కూడా ఎంతో దయతో వ్యవహరించింది. గతంలో భారత్‌లో ఉన్న అఫ్గనీలు ఎప్పుడూ ఆ దేశం గురించి, అక్కడి ప్రజల గురించి మాట్లాడుతుంటారు. అఫ్గాన్‌ ప్రజల తరఫున భారత్‌కు కృతజ్ఞతలు. అనేక సంవత్సరాలుగా పొరుగున ఉన్న దేశాల్లో భారత్‌ ఒక్కటే మంచి మిత్రదేశమని మేం భావిస్తున్నాం’’ అని చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని