Afghan: దయనీయం! తిండీ తిప్పలు లేకుండా పాక్‌ సరిహద్దు వద్ద పడిగాపులు

తాజా వార్తలు

Published : 24/09/2021 17:15 IST

Afghan: దయనీయం! తిండీ తిప్పలు లేకుండా పాక్‌ సరిహద్దు వద్ద పడిగాపులు

కాందహార్‌: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం వారి అరాచక పాలనకు భయపడి ఎంతో మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అమెరికా, ఉజ్బెకిస్థాన్‌, ఇంగ్లాండ్‌తో పాటు పలు దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు. దేశ సరిహద్దుల అవతలి వైపు ఉన్న పాకిస్థాన్‌కు లక్షల మంది చేరుకొని అక్కడ తలదాచుకుంటున్నారు. కాందహార్‌లోని స్పిన్‌ బోల్డక్‌ సరిహద్దు వద్దే ఇంకా అనేక మంది అనుమతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇకపై అఫ్గాన్‌ శరణార్థుల రాకను పాక్‌ పూర్తిగా నిషేధించినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది. స్పిన్‌ బోల్డక్‌తోపాటు దాదాపు అన్ని  సరిహద్దులను పూర్తిగా మూసివేసినట్లు తెలిపింది.

శరణార్థులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఏడ్చి, ప్రాధేయపడుతునప్పటికీ స్పిన్‌ బోల్డక్‌ వద్ద అధికారులు కనికరం చూపించడం లేదని న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. మహిళలు, చిన్న పిల్లలతో అక్కడే పడిగాపులు కాస్తున్న ప్రస్తుత పరిస్థితులు దయనీయంగా ఉన్నట్లు తెలిపింది. ఈనెల 1వ తేదీనే ఈ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతిచెందారు. అయితే తమ బాధ చూసైనా.. సరిహద్దును తెరవకపోతారా అని అనేక మంది అక్కడే తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. మాజల్‌ గేట్‌ వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలోనూ ఇద్దరు మృతిచెందినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది.

దేశంలోకి శరణార్థుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్‌ వెల్లడిస్తోంది. అఫ్గాన్‌తో ఉన్న అన్ని సరిహద్దులను మూసివేసినట్లు తెలిపింది. అఫ్గాన్‌ నుంచి 1.4 మిలియన్ల మంది శరణార్థులుగా వచ్చినట్లు పాక్‌ పేర్కొంది. అనుమతులు లేకుండా వచ్చినవారితో కలిపి మొత్తం 2 మిలియన్ల మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని