చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి: రైతులు

తాజా వార్తలు

Published : 08/02/2021 17:54 IST

చర్చలకు సిద్ధమే.. తేదీ చెప్పండి: రైతులు

దిల్లీ: రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నదాతలు తమ ఆందోళన విరమించి.. చర్చలకు రావాలని పార్లమెంట్‌ నుంచి ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు అనువైన తేదీ ప్రభుత్వమే నిర్ణయించాలని రైతు సంఘాల నాయకులు తెలిపారు. 

‘‘ప్రభుత్వంతో చర్చలను మేం ఎప్పుడూ తిరస్కరించలేదు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేం వెళ్లి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపాం. ఇప్పుడు కూడా చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. తదుపరి భేటీకి తేదీ, సమయం ప్రభుత్వమే నిర్ణయించాలి’’ సంయుక్త కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యులు, రైతు నేత శివకుమార్‌ కక్కా మీడియాకు తెలిపారు. మరో రైతు నాయకుడు అభిమన్యు కోహర్‌ మాట్లాడుతూ.. ‘‘కనీస మద్దతు ధరలో మార్పుండదని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు దానిపై చట్టబద్ధమైన హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది. కేంద్రంతో చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానం రావాలి’’ అని అన్నారు. 

ప్రధాని మోదీ నేడు రాజ్యసభలో మాట్లాడుతూ రైతుల ఆందోళన గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ‘కనీస మద్దతు ధర ఉండేది.. ఉంది.. ఎప్పటికీ ఉంటుంది’ అని హామీ ఇచ్చిన ప్రధాని.. రైతులు ఆందోళన విరమించాలని పిలుపునిచ్చారు. సమస్యను సమష్టిగా చర్చించి పరిష్కరించుకోవాలని.. ఈ సభా వేదిక నుంచి రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానని మోదీ తెలిపారు. 

నూతన సాగు చట్టాలపై కేంద్రం, ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు 11 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జరిగిన చర్చల్లో చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపివేస్తామని, రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా సవరణలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నాయకులు తిరస్కరించారు. సాగు చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి..

సాగు చట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

ఆ 1178 ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని