ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు: తికాయిత్‌

తాజా వార్తలు

Published : 11/02/2021 01:31 IST

ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు: తికాయిత్‌

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్రంలో ప్రభుత్వ మార్పు లక్ష్యం కాదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. కేవలం సమస్యల పరిష్కారమే రైతు ఉద్యమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సాగు చట్టాల విషయంలో కేంద్రం దిగి రాకుంటే త్వరలో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించినట్లు ఆయన‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రాకేశ్‌ సింఘు సరిహద్దులో నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో మాట్లాడారు.

‘కేంద్రంలో ప్రభుత్వంలో మార్పు జరగాలని రైతులు కోరుకోవట్లేదు. కేవలం సాగు చట్టాల్ని రద్దు చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం. అంతేకాకుండా కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీని కోరుతున్నాం. ప్రభుత్వం రైతు సమస్యలపై పరిష్కార మార్గంతో చర్చలకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. త్వరలో రైతు నాయకులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరిగి ఉద్యమాన్ని విస్తరిస్తారు’ అని రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు.

అంతేకాకుండా ఈ నెల 12న రాజస్థాన్‌లోని అన్ని టోల్ గేట్లలో రుసుముల చెల్లింపు నిరాకరణకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిస్తూ రైతు సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. 

ఇదీ చదవండి

ఆ పరికరంపైనే ‘అణు’మానాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని