ఏఐడీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ: నడ్డా
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 05:29 IST

ఏఐడీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ: నడ్డా

చెన్నై: తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మధురైలో నిర్వహించిన బహిరంగసభలో వెల్లడించారు. ‘ఏఐఏడీఎంకే పార్టీతో భాజపా పొత్తు కొనసాగుతుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి’ అని నడ్డా తెలిపారు. అంతకుముందు ఆయన మధురైలోని మీనాక్షి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు భాజపా కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై రాష్ట్ర స్థాయి నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.

ఇప్పటికే గత నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటనలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి రెండు పార్టీల పొత్తుపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘లోక్‌సభ ఎన్నికల మాదిరే భాజపా అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుంది. 2021 ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుంది. మోదీకి తమిళనాడు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-ఏఐఏడీఎంకే కూటమి ఆశించిన మేర రాణించలేకపోయింది.

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని