గుమ్మం దగ్గర ఉంటే..ఫోన్‌ కాల్‌ దూరంలో అంటారా.. 

తాజా వార్తలు

Published : 02/02/2021 01:48 IST

గుమ్మం దగ్గర ఉంటే..ఫోన్‌ కాల్‌ దూరంలో అంటారా.. 

దిల్లీ: రైతులు గుమ్మం దగ్గరే కూర్చొని ఉంటే.. వారితో ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉన్నామని ప్రభుత్వం మాట్లాడటం దురదృష్టకరమని శిరోమణి అకాలీ దళ్ మండిపడింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతన్నలకు మద్దతు తెలుపుతూ.. బడ్జెట్‌ వేళ పార్లమెంట్ నుంచి ఆ పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో.. భాజపాతో ఉన్న సుదీర్ఘ బంధానికి అకాలీ దళ్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

‘వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. మీరు చెప్పేది వినేందుకు మూడు నెలలుగా ఆ రైతులు గుమ్మం వద్దే కూర్చొని ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఫోన్ కాల్ కోసం వేచిచూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు వారికి భరోసా ఇవ్వడం అవసరం. కానీ ఇప్పటికీ ఫోన్ కాల్స్‌ గురించే మాట్లాడుతుండటం దురదృష్టకరం’ అని అకాలీ దళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్  ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని శివార్లలో చలిలో కూర్చున్న వారి గురించి ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో, ప్రధాని మన్‌కీ బాత్‌లో వారి గురించి ప్రస్తావించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.

ఇటీవల అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రైతులకు తమ ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలోనే ఉందని వెల్లడించారు. ఏడాదిన్నరపాటు చట్టాలను నిలిపివేసే ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని, చర్చలకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

బడ్జెట్‌..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని