close

తాజా వార్తలు

Updated : 29/11/2020 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజధాని నడిబొడ్డున గళం వినిపిస్తాం

‘చలో దిల్లీ’ ఆందోళనలో రైతుల డిమాండ్‌

దిల్లీ: రాజధాని నడిబొడ్డున తమ గళాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతులు డిమాండ్‌ చేశారు. రామ్‌లీలా మైదానం లేదా జంతర్‌ మంతర్‌ వద్ద తమ నిరసన కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల రైతులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజైన ఆదివారమూ కొనసాగుతోంది. 

పోలీసులు అనుమతించిన నిరంకారీ మైదానంలో నిరసన తెలిపేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, గాజిపూర్‌లో రహదారులపైనే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాల్ని ఉపసంహరించుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు డిసెంబరు 3న చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వ వర్గాలు డిసెంబరు 1న చర్చలు జరిపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో ఆందోళనల్లో పాల్గొన్న వివిధ రైతు సంఘాల నాయకులు రైతులతో సమావేశం నిర్వహిస్తున్నారు. విస్తృతంగా చర్చించి మధ్యాహ్నం తమ తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఇప్పటి వరకు రైతులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడలేదని.. శాంతియుతంగానే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని దిల్లీ పోలీసులు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కేంద్రాన్ని కోరారు. రైతుల్ని కేంద్రం ఉగ్రవాదులుగా చూస్తోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన