రైతన్నలూ..  చర్చలకు సిద్ధం: అమిత్‌ షా

తాజా వార్తలు

Updated : 28/11/2020 20:42 IST

రైతన్నలూ..  చర్చలకు సిద్ధం: అమిత్‌ షా

దిల్లీ: దేశ రాజధాని రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 3న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్‌ పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో నగరంలోనికి వచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని హెచ్చరించారు. వీరంతా ప్రధాన రహదారుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాలమైన స్టేడియాల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియాలని రైతులతో పోలీసులు చర్చించారు. అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఇంకా కొందరు రైతులు రహదారులపైనే ఉన్నారు. నిరసనల్లో ఎక్కువగా పంజాబ్‌ రైతులే ఉండటం గమనార్హం.

‘రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నదాతల ప్రతి సమస్య, డిమాండ్లను మేం పరిష్కరిస్తాం. డిసెంబర్‌ 3న వ్యవసాయ శాఖా మంత్రి చర్చలు చేపడతారు. చలి ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో రైతులు హైవేలపై ట్రాక్టర్లు, ట్రాలీల్లోనే ఉన్నారు. వారిని విశాలమైన స్టేడియాల్లోకి వారిని తరలించేందుకు దిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అక్కడికి వెళ్లండి. అక్కడ కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీసులు అనుమతిస్తారు. డిసెంబర్‌ 3కు ముందే చర్చలు చేపట్టాలంటే వెంటనే నిరసనలు ఆపేయండి. మరుసటి రోజే సమావేశానికి నేను హామీ ఇస్తున్నాను’ అని అమిత్‌ షా రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: చట్టాల్ని వెనక్కి తీసుకొనే వరకు ఆందోళనే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని