ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌షా

తాజా వార్తలు

Updated : 18/08/2020 11:51 IST

ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌షా

దిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఇటీవల కొవిడ్‌ సోకడంలో ఆయన గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కొవిడ్‌ సోకడంతో వైద్యుల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌ ఆస్పత్రిలో చేరారు. మరోసారి పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్టు ఈనెల 14న అమిత్ షా ట్వీట్‌ చేశారు.

తాజాగా శ్వాసకోశ సమస్యతోపాటు రెండు మూడు రోజులుగా ఒంటి నొప్పులు రావడంతో ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో అమిత్‌ షాకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన అర్ధరాత్రి 2 గంటలకు ఎయిమ్స్‌లో చేరినట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని