Miss Universe 2020: మెక్సికో అందానిదే!
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Miss Universe 2020: మెక్సికో అందానిదే!

వాషింగ్టన్: మిస్‌ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా (Andrea Meza) సొంతం చేసుకున్నారు. 73 మందిని దాటుకొని 26ఏళ్ల మేజా ఈ టైటిల్‌ను గెల్చుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె.. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. 69వ మిస్‌ యూనివర్స్ పోటీలు ఫ్లొరిడాలోని సెమినోలే హార్డ్ రాక్ హాలీవుడ్ హోటల్‌లో ఆదివారం జరిగాయి. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ.. తుది దశలో ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. ఆండ్రియా లింగ సమానత కోసం కూడా కృషి చేస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి జొజిబిని తుంజి ఆమెకు కిరీటాన్ని పెట్టారు. కరోనా కారణంగా విశ్వసుందరి పోటీలను గతేడాది నిర్వహించలేదు. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో.. మూడో రన్నరప్‌గా నిలిచారు.

మరోవైపు, ఇదే వేదికపై మయన్మార్ నుంచి పాల్గొన్న థుజార్ వింట్‌ ల్విన్..తన దేశంలో సైన్యం ఆకృత్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘సైన్యం చేతిలో నిత్యం మయన్మార్ వాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరు మయన్మార్ పౌరులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. మిస్‌ యూనివర్స్ మయన్మార్‌గా సైన్యం తిరుగుబాటు గురించి సాధ్యమైనంత మాట్లాడుతున్నాను’ అంటూ తన దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రపంచం ముందుంచారు. ఫిబ్రవరి 1న ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి, పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని