జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

తాజా వార్తలు

Published : 14/03/2021 01:17 IST

జూన్‌ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

జమ్మూ: కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన శనివారం ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అమర్‌నాథ్‌ యాత్రకు ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంకులకు చెందిన నిర్దేశించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గతేడాది కేవలం సాధువులకు మాత్రమే యాత్రకు అనుమతిచ్చారు. అంతకుముందు ఏడాది ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో అర్థాంతరంగా యాత్రను నిలిపివేశారు. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సగటున రెండున్నర నుంచి మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని