Assam: ఖడ్గమృగాల 2479 కొమ్ముల కాల్చివేత.. ఎందుకంటే?

తాజా వార్తలు

Updated : 23/09/2021 05:55 IST

Assam: ఖడ్గమృగాల 2479 కొమ్ముల కాల్చివేత.. ఎందుకంటే?

డిస్పుర్‌: ప్రపంచ ఖడ్గమృగాల సంరక్షణ దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేసింది. కజిరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలోని బొకాఖట్‌ కవాతు మైదానంలో మైదానంలో 2479 కొమ్ములను కాల్చి వేసింది. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉన్నాయనే అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అస్సాం సర్కారు వెల్లడించింది.

ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ప్రపంచంలోనే అత్యధికంగా అస్సాంలో ఉన్నాయి. చైనీయులు తమ సంప్రదాయ ఔషధాల తయారీలో ఖడ్గ మృగాల కొమ్ములను ఉపయోగిస్తుండగా, వియత్నాంలో ఈ కొమ్ము కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తారు. ఈ కొమ్ములపై మూఢనమ్మకాలు పెరగడంతో అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో ఖడ్గమృగాల వేట కూడా పెరగటంతో అస్సాం సర్కార్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కొమ్ములను కాల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మూఢనమ్మకాలు తొలగిపోయి ఖడ్గమృగాల సంరక్షణ పెరిగేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని