ఈ ప్రత్యేక పథకాలు వారి కోసమే!
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ప్రత్యేక పథకాలు వారి కోసమే!

ప్రకటించిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

గువాహటి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు, భర్తను కోల్పోయిన మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. తాజాగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ముఖ్యమంత్రి శిశు సేవా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాం. 11 ఏళ్ల వయసులోపు పిల్లలు అనాథలైతే.. వారి పేరు మీద రూ.7,81,200 లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాం. తద్వారా వారికి 24 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతీనెలా వారికి రూ.3,500 వస్తుంది. 24ఏళ్లు వచ్చాక వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోని మొత్తాన్ని తీసుకోవచ్చు. వితంతువులకి ఆర్థిక అండగా నిలిచేందుకు ఒకేసారి రూ.2.5 లక్షలతో పాటు అరుణోదయ పథకంలో భాగంగా ప్రతీనెలా రూ.830-1130 ఇస్తాం. అదేవిధంగా వితంతు పింఛన్‌ పథకం కింద రూ.300 వర్తిస్తుంది’’ అని ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని