Vaccine: టీకా వేసుకోకుండా బయట తిరిగితే.. జరిమానానే!

తాజా వార్తలు

Updated : 06/06/2021 12:45 IST

Vaccine: టీకా వేసుకోకుండా బయట తిరిగితే.. జరిమానానే!

ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం

ఔరంగాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా నిలువరించడంతో పాటు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే దిశగా మహారాష్ట్రంలోని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ తీసుకోకుండా బయట తిరిగే వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు. అయితే, ఈ నిబంధన 45 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తుందని కార్పొరేషన్‌ వైద్యాధికారి నీతా పడాల్‌కర్‌ వెల్లడించారు. 

ఔరంగాబాద్‌ జనాభా 17 లక్షలు. ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లతో కలిపి 3.08 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. అంటే నగర జనాభాలో 20 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నగర ప్రజలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని నీతా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలను వ్యాక్సినేషన్‌ దిశగా మరల్చేందుకు ఈ నిర్ణయ తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మంది టీకా తీసుకోవడం వల్ల నగరంలో త్వరగా కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే 45 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని