Australia covid cases: ఆస్ట్రేలియాలో తొలిసారి 1000+ కేసులు.. ఆస్పత్రుల బయట టెంట్లు!

తాజా వార్తలు

Published : 26/08/2021 20:49 IST

Australia covid cases: ఆస్ట్రేలియాలో తొలిసారి 1000+ కేసులు.. ఆస్పత్రుల బయట టెంట్లు!

సిడ్నీ: పటిష్ఠమైన కరోనా లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ఇన్నాళ్లు కేసులు పెరగకుండా జాగ్రత్త పడిన ఆస్ట్రేలియాకూ ఇప్పుడు కరోనా గుబులు మొదలైంది. తాజాగా ఆ దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. సిడ్నీలో ఆస్పత్రుల వద్ద అత్యవసర టెంట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ మొదలైన తర్వాత ఈ స్థాయిలో ఆస్ట్రేలియాలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 47,700 పాజిటివ్‌ కేసులు, 989 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 16 ఏళ్లు పైబడిన 32 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 54 శాతం మంది ప్రజలు ఒక్క డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలౌతున్నాయి. కనీసం 70 శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తయితే గానీ లాక్‌డౌన్‌ను సడలించే ఉద్దేశమేదీ లేదని ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొత్త కేసులు వెలుగుచూడడం గమనార్హం.

న్యూ సౌత్‌ వేల్‌ రాష్ట్రం నుంచే 1029 కేసులు వెలుగుచూశాయి. ఒక్క సిడ్నీ నగరంలోనే ఈ సంఖ్య 969గా ఉంది. దీంతో సిడ్నీ నగరం ఇప్పుడు కొవిడ్‌ విజృంభణకు ప్రధాన కేంద్రంగా మారింది. డెల్టా వేరియంట్‌ వల్ల ఈ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. రోగుల తాకిడిని తట్టుకునేందుకు వీలుగా అక్కడి ఆస్పత్రులు ఆరుబయట టెంట్లు ఏర్పాటు చేశాయి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాలైన మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాల్లో కూడా కఠిన లాక్‌డౌన్‌ అమలౌతోంది. అక్కడా సైతం కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు మూడు లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తుండగా.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆస్ట్రేలియా ఫెడరల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని