బాబా కా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం!
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 19:23 IST

బాబా కా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాబా కా దాబా’ యజమాని కాంతా ప్రసాద్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. గురువారం రాత్రి 11.15 గంటలకు  సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రి సిబ్బంది నుంచి పోలీసులకు ఈ విషయం తెలిసింది. కాంతా ప్రసాద్‌ మద్యంలో నిద్రమాత్రలు కలుపుకుని తాగడంతో స్పృహ తప్పినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కరణ్‌ కూడా ధ్రువీకరించాడు. 

గతేడాది యూట్యూబర్‌ గౌరవ్‌ వాసన్‌ ‘బాబా కా దాబా’పై కథనాన్ని చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అందులో కాంతా ప్రసాద్‌ దయనీయ పరిస్థితి చూసి వేలమంది స్పందించి ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో గౌరవ్‌ వాసన్‌ తనకు వచ్చే సాయాన్ని మళ్లిస్తున్నాడని ఆరోపిస్తూ కాంతా ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. కానీ భారీగా నష్టం రావడంతో మళ్లీ తిరిగి పాత ప్రదేశానికే వచ్చేసి దాబా ప్రారంభించాడు. 

కొద్దిరోజుల కిందట గౌరవ్‌ వాసన్‌ దొంగకాదని, ఎంతో మంచి వాడంటూ ఆయన కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ వీడియోను ఓ ఫుడ్‌ బ్లాగర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇటీవలే గౌరవ్‌వాసన్‌ కూడా ఆయన  దాబాకు వెళ్లగా.. ఒక్కసారిగా బోరున విలపించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించాడు.   

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని