కొవిడ్‌ ఆంక్షలకు నిరసనగా మద్యం విక్రయాలు బంద్‌!

తాజా వార్తలు

Published : 04/04/2021 02:18 IST

కొవిడ్‌ ఆంక్షలకు నిరసనగా మద్యం విక్రయాలు బంద్‌!

ఠానేలో హోటళ్ల యజమానుల ప్రకటన

ముంబయి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఠానే జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్‌ యజమానుల సంఘం నిరసన తెలియజేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూతో తమ వ్యాపారాలు మరింత దెబ్బతింటున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీనికి నిరసనగా తమ డిమాండ్లు నెరవేరే దాకా జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్‌ ఫీజును వాయిదాల వారీగా చెల్లించేందుకు అనుమతించడంతో పాటు రాత్రి 8 గంటల నుంచి విధించిన కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాక ఠానేతో పాటు డొంబ్లివి, కల్యాణ్‌, నవీ ముంబయి తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని