Bharat Bandh: ‘భారత్‌ బంద్‌’కు బ్యాంకు అధికారుల సంఘం మద్దతు

తాజా వార్తలు

Published : 22/09/2021 23:51 IST

Bharat Bandh: ‘భారత్‌ బంద్‌’కు బ్యాంకు అధికారుల సంఘం మద్దతు

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ నెల 27న పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) మద్దతు ప్రకటించింది. రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు పునఃప్రారంభించాలని కోరింది. రైతులకు సంఘీభావంగా ఏఐబీఓసీ అనుబంధ సంస్థలు, రాష్ట్ర శాఖలు కూడా దేశవ్యాప్తంగా బంద్‌లో పాల్గొంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భూమి, పశు సంపద, వ్యవసాయ కుటుంబాల పరిస్థితిపై అంచనా- 2018-19 నివేదిక ప్రకారం.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సుదూర స్వప్నంగానే మిగిలిపోతుందని సూచిస్తోందని ఏఐబీఓసీ పేర్కొంది. ఈ రంగంలో పెరిగిపోతున్న సగటు రుణ భారం వ్యవసాయ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని