‘వాషింగ్టన్‌ దాడి’ ఓ అందమైన దృశ్యం..

తాజా వార్తలు

Published : 07/01/2021 15:02 IST

‘వాషింగ్టన్‌ దాడి’ ఓ అందమైన దృశ్యం..

విచిత్రంగా స్పందించిన చైనా

బీజింగ్‌: ఎన్నికల్లో తమ నాయకుడి అపజయాన్ని సహించలేని ట్రంప్‌ వర్గీయులు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నిరసనలకు దిగారు. ఇక్కడి క్యాపిటల్‌ భవనంలోకి చొరబడి విధ్వంసం చేయటమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ఫీ తీసుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాగా, ఈ విషయమై చైనా భిన్నంగా స్పందించింది. ఈ ఉదంతాన్ని ‘‘అందమైన దృశ్యం..’’ అని అభివర్ణిస్తూ సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ప్రజాస్వామ్యానికి చేటు అని పలు ప్రపంచ దేశాలు ఈ ఘటనను ఖండించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ విధంగా స్పందించింది. హాంకాంగ్‌ అల్లర్లను సమర్థించి, వాషింగ్టన్‌ ఘటనను ఖండించడం ద్వారా.. యూరోపియన్‌ దేశ నాయకులందరూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారంటూ ఆ పార్టీ విమర్శించింది.

హాంగ్‌కాంగ్‌లో జులై 2019లో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కాంప్లెక్స్‌ భవనంలో పలువురు నిరసనకారులు చొరబడి చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. దీనిని తాజా క్యాపిటల్‌ భవనం ఘటనతో పోలుస్తూ చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్’ నేటి ఉదయం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును పెట్టింది. ‘‘అమెరికా స్పీకర్‌ పెలోసీ ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌ నిరసనలను అద్భుత దృశ్యంగా అభివర్ణించారు. ఇక క్యాపిటల్‌ భవనంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనపై కూడా ఆమె అదే విధంగా స్పందిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది’’ అంటూ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా ఆ దేశ అధికార కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగం కూడా ఈ నిరసన ఘటనను అందమైన దృశ్యంగా అభివర్ణిస్తూ.. సామాజిక మాధ్యమం వైబోలో ఫొటోలను షేర్‌ చేసింది. కాగా, ఈ పోస్టును గంటల వ్యవధిలోనే 23 కోట్ల మంది వీక్షించారు. 

ఇవీ చదవండి..

 క్యాపిటల్‌ దాడి.. ట్రంప్‌పై వేటు?

 వాషింగ్టన్‌ ఘటన.. నలుగురి మృతిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని