Beijing denies: ఆ హ్యాకింగ్‌తో మాకు సంబంధం లేదు..!

తాజా వార్తలు

Published : 24/09/2021 15:44 IST

Beijing denies: ఆ హ్యాకింగ్‌తో మాకు సంబంధం లేదు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కీలక శాఖలపై జరిగిన సైబర్‌ దాడుల్లో చైనా హ్యాకర్ల పాత్ర లేదని బీజింగ్‌ తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భారత్‌పై సైబర్‌ దాడుల విషయాన్ని వెల్లడించిన అమెరికన్‌ కంపెనీ నివేదికను శుద్ధ అబద్ధమని కొట్టిపారేసింది. ఇటీవల అమెరికాకు చెందిన ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌ ఏజెన్సీ .ఐఎన్‌సీ’ కంపెనీ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్లు భారత్‌కు చెందిన కీలక డేటాను దొంగతనం చేశారని పేర్కొంది. దీంతోపాటు దేశంలోని అతిపెద్ద మీడియా కంపెనీల సిస్టమ్‌లను కూడా హ్యాక్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ నివేదికపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది.

‘‘ఆ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ చైనా ప్రతిష్ఠను దెబ్బతీసేలా తరచూ కల్పిత సమాచారంతో తప్పుదోవ పట్టిస్తోంది. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఏ  ఆరోపణ చేసినా ఆధారాలు ఉండాలి’’ అని చైనా విదేశాంగ శాఖ లిఖిత పూర్వక ప్రకటన జారీ చేసింది. గతంలో కూడా చైనా హ్యాకర్లు  మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ఛేంజీ ఈమెయిల్‌ సర్వీస్‌ను హ్యాక్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. చైనా ప్రకటనపై రికార్డెడ్‌ ఫ్యూచర్‌ వెంటనే స్పందించలేదు. మరోపక్క భారత్‌ కూడా అటువంటి హ్యాకింగ్‌ ఘటన  జరిగినట్లు అంగీకరించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని