చుట్టుముట్టిన కార్యకర్తలు.. అభ్యర్థి పరుగులు
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 16:32 IST

చుట్టుముట్టిన కార్యకర్తలు.. అభ్యర్థి పరుగులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అభ్యర్థి, నటి సయోనీ ఘోష్‌ ప్రచారం సందర్భంగా విచిత్ర పరిస్థితి ఎదురైంది. తనపైకి పార్టీ కార్యకర్తలు దూసుకురావడంతో పరుగులుపెట్టారు. సయోనీ ఘోష్‌ టీఎంసీ పార్టీ తరఫున దక్షిణ అసాన్సోల్‌ నియోజికవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని బాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించగా స్థానికులను కలుస్తూ, వారితో కరచాలనం చేస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు సయోనీపైకి దూసుకొచ్చారు. కాస్త దూరంగా ఉండాలని ఆమె వారించినా వారు వినలేదు. దీంతో చేసేదేమీలేక సయోనీ ఘోష్‌ అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ ఘటనపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ మహిళలకు రక్షణ కల్పించలేని టీఎంసీ.. రాష్ట్రంలోని మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని