jeff bezos: స్పేస్‌కు బెజోసే కాదు.. ఆయన గీసిన బొమ్మలు కూడా!

తాజా వార్తలు

Published : 16/10/2021 02:15 IST

jeff bezos: స్పేస్‌కు బెజోసే కాదు.. ఆయన గీసిన బొమ్మలు కూడా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌.. ఇటీవల తన స్పేస్‌ సంస్థ బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన రాకెట్‌లో అంతరిక్షానికి వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అంతరిక్షప్రయాణాన్ని పర్యటకంగా మార్చే లక్ష్యంతో బెజోస్‌ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బ్లూ ఆరిజిన్‌ రెండో అంతరిక్షయాత్రను తాజాగా నిర్వహించింది. అందులో వ్యోమగాములతోపాటు బెజోస్‌ చిన్నతనంలో గీసిన కొన్ని బొమ్మలను కూడా అంతరిక్షానికి వెళ్లి వచ్చాయి. 

ఈ విషయాన్ని అంతరిక్షయానానికి ముందు బెజోస్‌ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నా తొమ్మిదేళ్ల వయసులో స్టార్‌ట్రెక్‌ టెలీసిరీస్‌లో ఉపయోగించిన ట్రైకార్డర్స్‌(ఊహాజనిత పరికరం), కమ్యూనికేటర్స్‌ను కాగితంపై గీసి వాటితో ఆడుకునేవాడిని. వాటిని మా అమ్మ 48ఏళ్లుగా భద్రంగా దాచిపెట్టింది. గతవారం అవి బయటపడ్డాయి. వాటిని విలియమ్‌ శాంట్నర్‌ అంతరిక్షానికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు’అని పేర్కొన్నారు.

విలియమ్‌ శాంట్నర్‌.. తాజాగా చేపట్టిన అంతరిక్షయాత్రలో సభ్యుడు. స్టార్‌ట్రెక్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ టెలీ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించాడు. బెజోస్‌కు ఆ సిరీస్‌ అంటే ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే శాంట్నర్‌ను అంతరిక్షానికి పంపించారు. దీంతో అంతరిక్షానికి వెళ్లిన అత్యంత వృద్ధుడు(90)గా శాంట్నర్‌ రికార్డు సృష్టించాడు. అంతరిక్షానికి వెళ్లిన వారిలో శాంట్నర్‌తోపాటు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఉడ్రే పవర్స్‌, ప్లానెట్‌ ల్యాబ్స్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు క్రిస్‌ బోషిజెన్‌, మెడిడేటా సొల్యూషన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో గ్లెన్‌ డి రిస్‌ ఉన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని