టీకా మానవ ప్రయోగాల్లో 23వేల మంది వాలెంటీర్లు

తాజా వార్తలు

Published : 03/01/2021 14:04 IST

టీకా మానవ ప్రయోగాల్లో 23వేల మంది వాలెంటీర్లు

దేశంలో ఏకైక మానవ ప్రయోగం: భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను దేశీయంగా అభివృద్థి చేసింది. ఇందుకు సంబంధించి కీలకమైన మూడోదశ మానవ ప్రయోగాల్లో పాల్గొనేందుకు తొలివిడతగా 23 వేల మంది వాలెంటీర్లను నమోదు చేసుకొంది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లతో కలసి కొవాగ్జిన్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా మూడోదశ ప్రయోగాలు నవంబర్‌లో ప్రారంభమయ్యాయి.

కొవాగ్జిన్‌ మూడోదశ ప్రయోగాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మొత్తం 26 వేల మందిపై నిర్వహించనున్నారు. భారత్‌లో ఇంతవరకు జరిగిన మనుషులపై టీకా ప్రయోగాల్లో ఇదే అతిపెద్దదని కూడా భారత్‌ బయోటెక్‌ తెలిపింది. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొంటున్న వాలెంటీర్లకు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా కృతజ్ఞతలు తెలియచేశారు. వారి సహకారం దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గొప్ప ధైర్యాన్నిస్తుందని ఆమె ప్రశంసించారు. తమ కరోనా టీకా ప్రయోగాల్లో భాగమైన  ముఖ్య పరిశోధకులు, వైద్యులు, ఆస్పత్రులు, వైద్యారోగ్య సిబ్బంది తదితరులందరికీ కూడా ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి.. 

భారత్‌లో టీకా వచ్చేసింది..

20,923 రికవరీలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని