కొవాగ్జిన్‌ నిల్వ గడువును పెంచేందుకు అనుమతించండి!

తాజా వార్తలు

Published : 25/04/2021 19:31 IST

కొవాగ్జిన్‌ నిల్వ గడువును పెంచేందుకు అనుమతించండి!

డీసీజీఐకి లేఖ రాసిన భారత్‌ బయోటెక్‌

దిల్లీ: తాము దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ నిల్వ గడువు(షెల్ఫ్‌ లైఫ్‌)ను పొడిగించాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌.. భారత ఔషధ నియంత్రణ సంస్థకు లేఖ రాసింది. 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద కొవాగ్జిన్‌ను తయారు చేసిన తేదీ నుంచి ఆరు నెలల పాటు నిల్వ చేసేందుకు డీసీజీఐ అనుమతించింది. ఈ ఆరు నెలల నిల్వ గడువును 24 నెలలకు పొడిగించాలని తాజాగా కోరింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా లేఖతో పాటు సమర్పించింది. 

ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకా నిల్వ గడువును ఆరు నుంచి తొమ్మిది నెలలకు పొడిగించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటి వరకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండే అందుబాటులోకి వచ్చాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినప్పటికీ.. ఇంకా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని