పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అనుమతి

తాజా వార్తలు

Published : 04/01/2021 17:24 IST

 పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అనుమతి

కొవాగ్జిన్‌ టీకాకు అనుమతిచ్చిన డీసీజీఐ

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. అయితే, ఈ వ్యాక్సిన్‌లలో ఎక్కువగా 18ఏళ్ల వయసు పైబడిన వారిపైనే ప్రయోగాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మూడో దశ ప్రయోగాలను 12ఏళ్ల వయసు పిల్లలపై జరిపేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కొవాగ్జిన్‌ను తయారుచేసేందుకు భారత్‌ బయోటెక్‌కు లైసెన్సు జారీ చేసిన విషయం తెలిసిందే.

భారత్‌లో కొవిషీల్డ్‌ ఉత్పత్తి, ప్రయోగాలను నిర్వహిస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే విదేశాల్లో తుదిదశ ప్రయోగాలు పూర్తి చేసుకుంది. భారత్‌ బయోటెక్‌ మాత్రం మూడోదశ ప్రయోగాలను ఇక్కడ కొనసాగిస్తోంది. అయితే ఇప్పటివరకు 12ఏళ్లు పైబడిన పిల్లల్లో తొలి, రెండో దశ ప్రయోగాలను పూర్తిచేసింది. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ సురక్షితమని తేలడంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతి ఇస్తున్నట్లు డీసీజీఐ వెల్లడించింది. దీంతో 12ఏళ్ల వయసువారిపై భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలను చేపట్టనుంది. అయితే, వ్యాక్సిన్‌ సమర్థత, సురక్షితమని నిర్ధారించే తొలి, రెండు, మూడో దశ ప్రయోగాల తాజా సమాచారాన్ని అందించాలని డీసీజీఐ కోరింది.

ఇదిలాఉంటే, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలను 25,800మందిపై ప్రారంభించినట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 22,500 వేల మందికి వ్యాక్సిన్‌ అందించింది. ఇక, కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండు వ్యాక్సిన్‌లు కూడా రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వానికి అందించే తొలి పదికోట్ల డోసులను కేవలం రెండు వందలకే ఒక డోసు చొప్పున అందిస్తామని, ప్రైవేటు వినియోగదారులకు మాత్రం వెయ్యి రూపాయలకు ఒకడోసు ఇస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ ప్రకటించారు.

ఇవీ చదవండి..
కొవాగ్జిన్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..!
పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌...ఎప్పుడు రావచ్చంటే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని