మళ్లీ అనారోగ్యం: ఎంపీ ప్రగ్యా ముంబయికి తరలింపు!

తాజా వార్తలు

Published : 06/03/2021 18:42 IST

మళ్లీ అనారోగ్యం: ఎంపీ ప్రగ్యా ముంబయికి తరలింపు!

ముంబయి: భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో చికిత్సనిమిత్తం ఆమెను విమానంలో ముంబయికి తరలించారు. శ్వాససంబంధమైన సమస్యలు తలెత్తడంతో ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆమె కార్యాలయం వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆమె అనారోగ్యానికి గురికావడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 19న అనారోగ్యంతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో కూడా ఆమె కొవిడ్‌ లక్షణాలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 

2008 మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన ప్రగ్యా ఠాకూర్‌ 2017లో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమెకు బెయిల్‌ మంజూరైంది. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి బరిలో నిలిచిన ప్రగ్యా.. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని