వ్యాక్సినేషన్‌పై భూటాన్‌ ప్రధాని అభినందనలు

తాజా వార్తలు

Published : 16/01/2021 23:35 IST

వ్యాక్సినేషన్‌పై భూటాన్‌ ప్రధాని అభినందనలు

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి భారత్‌ నేడు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాప్తిని నిరోధించే టీకా పంపిణీని ప్రారంభించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి, దేశ ప్రజలకు భూటాన్‌ ప్రధాని లొటాయ్‌ షెరింగ్‌ అభినందనలు తెలియజేశారు. 

‘దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ, భారత ప్రజలకు అభినందనలు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు అనుభవించిన కష్టాలు ఇకనైనా తగ్గుతాయని ఆశిస్తున్నాం’ అని షెరింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. భూటాన్‌ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత శాస్త్రవేత్తల కృషి వల్లే అతి తక్కువ సమయంలో టీకాలు అందుబాటులోకి తీసుకురాగలిగామని తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం ఏం చేయడానికైనా భారత్‌ సిద్ధంగా ఉంటుందని మోదీ అన్నారు.  

దేశవ్యాప్తంగా టీకా పంపిణీని ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. మొదటి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు తొలి ప్రాధాన్యంగా వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50ఏళ్ల లోపువారికి టీకా వేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి..

భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు! 

కన్నీటి పర్యంతమైన మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని